సిద్ధిపేటకు ఉపఎన్నిక... రాజకీయాల్లోకి హరీశ్ రావు భార్య శ్రీనిత: కేసీఆర్ అన్న కుమార్తె ఆసక్తికర పోస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిద్ధిపేటకు ఉపఎన్నిక... రాజకీయాల్లోకి హరీశ్ రావు భార్య శ్రీనిత: కేసీఆర్ అన్న కుమార్తె ఆసక్తికర పోస్ట్!

  • హరీశ్ రావును లోక్ సభకు పంపుతారని వార్తలు
  • 4 నెలల్లో సిద్ధిపేటకు ఉపఎన్నికలు
  • కాంగ్రెస్ వాట్స్ యాప్ గ్రూప్ లో రమ్యారావు వ్యాఖ్య
మరో నాలుగు నెలల కాలంలో సిద్ధిపేటకు ఉప ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికలో తన్నీరు హరీశ్ రావు భార్య శ్రీనిత బరిలోకి దిగడం ద్వారా రాజకీయాల్లోకి వస్తారని సీఎం కేసీఆర్‌ అన్న కుమార్తె, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌ రమ్యారావు ఆసక్తికర పోస్టును పెట్టారు. కాంగ్రెస్ కు చెందిన వాట్స్ యాప్ గ్రూప్ లో 'తాజా తెలంగాణ' హెడ్డింగ్ తో ఆమె ఈ పోస్ట్ పెట్టారు.

 "మరో 4 నెలల్లో సిద్ధిపేటకు బై ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత" అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ రావును పార్లమెంట్ కు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రమ్యారావు పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె పోస్టుపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది.
Ramyarao
Harish Rao
Srinitha
Siddipet

More Telugu News