బుల్లితెరపై కూడా సత్తా చాటిన 'సర్కార్'
Add ap7am to your home Screen

బుల్లితెరపై కూడా సత్తా చాటిన 'సర్కార్'

  • విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్'
  • ఇటీవలే సన్ టీవీలో ప్రసారం 
  • బుల్లితెర నుంచి కూడా భారీ ఆదరణ
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేసిన 'సర్కార్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలోకి ఈ సినిమా చేరిపోయింది. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోయింది.

మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ పొందిన ఈ సినిమాను ఇటీవల మొదటిసారిగా 'సన్ టీవీ'లో ప్రసారం చేయగా, 16.9 మిలియన్ల వ్యూవర్ షిప్ ను రాబట్టింది. ఇంతవరకూ సౌత్ లో అత్యధిక వ్యూవర్ షిప్ ను పొందిన 3వ చిత్రంగా నిలిచింది. తొలి రెండు స్థానాల్లో 'పిచై క్కారన్' (బిచ్చగాడు), 'బాహుబలి' కొనసాగుతున్నాయి. విజయ్ కి గల క్రేజ్ .. మురుగదాస్ కి గల ఇమేజ్ .. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ డ్రామా కావడంతో, ఈ సినిమాకి ఈ స్థాయి వ్యూవర్ షిప్ లభించిందని చెప్పుకుంటున్నారు. 
vijay
keerthi suresh

More Telugu News