వారం రోజుల్లో సిరియాలో ఐసిస్ పూర్తిగా అంతమవుతుంది: డొనాల్డ్ ట్రంప్
- ఇప్పటికే సిరియాలో ఐసిస్ ను భారీ ఎత్తున దెబ్బతీశాం
- మిగిలిన స్థావరాలను కూడా ఐసిస్ కోల్పోనుంది
- ఐసిస్ ను పూర్తగా అంతమొందించామనే వార్తను వారం రోజుల్లో ప్రకటిస్తాం
సిరియా, ఇరాక్ లలో యూఎస్ మిలిటరీ, తమ భాగస్వాములు, సిరియన్ డెమోక్రాటిక్ బలగాలు కలసి ఐసిస్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. వారం రోజుల్లో సిరియాలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందించామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే విధానానికి అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పారు.