బాలయ్య .. బోయపాటి సినిమాలో రకుల్
Add ap7am to your home Screen

బాలయ్య .. బోయపాటి సినిమాలో రకుల్

  • రకుల్ కి వరుస పరాజయాలు
  • కొత్త కథానాయికల పోటీ
  • బోయపాటి దర్శకత్వంలో మూడోసారి 
రకుల్ ను ఎంత వేగంగా సక్సెస్ లు వరిస్తూ వచ్చాయో .. అంతే ఫాస్టుగా పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. దాంతో తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక కొత్త కథానాయికల నుంచి గట్టి పోటీ ఎదురవుతూ ఉండటం కూడా ఆమెకి అవకాశాలు తగ్గడానికి మరో కారణమని చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలోనే ఆమె బాలకృష్ణతో జోడీ కట్టడానికి అంగీకరించినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. బోయపాటి తన గత చిత్రాలైన 'సరైనోడు'.. 'జయ జానకి నాయక' సినిమాల్లో రకుల్ కి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బాలకృష్ణతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన రకుల్ నే తీసుకున్నట్టుగా సమాచారం. అటు బాలకృష్ణతోను .. ఇటు రకుల్ తోను బోయపాటికి ఇది మూడవ సినిమా కావడం విశేషం. ఇక రకుల్ 'వెంకీమామ'లో చైతూ సరసన చేయనున్న విషయం తెలిసిందే.
balakrishna
rakul

More Telugu News