రూ. 36 వేలతో కుమారుడి వివాహం చేయనున్న ఏపీ ఐఏఎస్ ఆఫీసర్!

  • వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ గా పట్నాల బసంత్‌ కుమార్‌
  • గతంలో కుమార్తె పెళ్లికి రూ. 16,100 ఖర్చు
  • 10వ తేదీన జరగనున్న వివాహం
పెళ్లంటేనే లక్షల నుంచి కోట్లకు ఖర్చు పెరిగిపోయిన రోజులివి. ఇక ఓ ఐఏఎస్ అధికారి ఇంట వివాహమంటే... చెప్పేక్కర్లేదు. విపరీతమైన ఆడంబరంగా జరుగుతుందని భావిస్తాం. కానీ, విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పట్నాల బసంత్‌ కుమార్‌ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం.

గతంలో తన కుమార్తె వివాహాన్ని రూ. 16,100 ఖర్చుతో జరిపించిన ఆయన, ఇప్పుడు తన కుమారుడి పెళ్లికి రూ. 36 వేలు ఖర్చు చేయనున్నారు. అందులో కూడా సగం... అంటే రూ. 18 వేలను పెళ్లి కుమార్తె తరఫువారు ఇవ్వనున్నారు. వివాహం, ఆపై విందు కలిపి పెళ్లికి ఖర్చయ్యే మొత్తం ఇదే. ఈ పెళ్లి 10వ తేదీన విశాఖపట్నంలోని దయాళ్ నగర్ లో ఉన్న సత్సంగ్ ఆధ్వర్యంలో జరగనుంది. రేపు వధూవరుల ఆశీర్వాద వేడుక జరగనుండగా, గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరు కానున్నారు.
Go Back to Shorts
Patnala Basantkumar
IAS
Marriage
Vizag

More Telugu News