ఒకే చోట ప్రభాస్ .. చరణ్ సినిమాల షూటింగ్
Add ap7am to your home Screen

ఒకే చోట ప్రభాస్ .. చరణ్ సినిమాల షూటింగ్

  • 'సాహో' షూటింగులో ప్రభాస్ 
  • చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
  •  'మహానాయకుడు' పనుల్లో బాలకృష్ణ  
ప్రస్తుతం ప్రభాస్ .. 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక చరణ్ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి సంబంధించి, చరణ్ కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వుంది. ఇక ఇక్కడే బాలకృష్ణ 'మహానాయకుడు' సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. మొత్తానికి స్టార్ హీరోలంతా ఎవరి సినిమాల షూటింగులతో వాళ్లు బిజీబిజీగా ఉన్నారన్న మాట. 
prabhas
charan
balakrishna

More Telugu News