సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మామూలు విషయం కాదంటున్న కాజల్
  • 'వాల్మీకి'కి మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభం 
  • 'ఏబీసీడీ' కోసం పాట చిత్రీకరణ
*  కమర్షియల్ సినిమాల్లో నటించడం కూడా ఒక సవాలే అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'కమర్షియల్ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ విషయంలో కథానాయికలకు కొన్ని పరిమితులు వుంటాయి. అయినా అటువంటి పాత్రల్లో నటించి మెప్పించడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక ఛాలెంజే' అని చెప్పింది కాజల్. ప్రస్తుతం తెలుగులో 'సీత', తమిళంలో 'భారతీయుడు 2' చిత్రాలలో ఆమె నటిస్తోంది.
*  'ఎఫ్ 2' విజయంతో జోష్ మీదున్న హీరో వరుజ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'వాల్మీకి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం చెన్నైలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిటింగ్స్ నిర్వహిస్తున్నాడు.
*  అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏబీసీడీ' చిత్రానికి సంబంధించిన ఓ పాటను ప్రస్తుతం హైదరాబాదులో సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చ్ 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Kajal Agarwal
Varuntej
Harish
Devishri

More Telugu News