కేటీఆర్ నిజాయతీ గల వ్యక్తి.. హరీశ్ రావు బ్లాక్ మెయిలర్: జగ్గారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ నిజాయతీ గల వ్యక్తి.. హరీశ్ రావు బ్లాక్ మెయిలర్: జగ్గారెడ్డి

  • కేసీఆర్ వల్ల నాకు రెండుసార్లు మంచి జరిగింది
  • నన్ను జైల్లో పెట్టించింది హరీశ్ రావే
  • కేసీఆర్ కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై రాజకీయ విమర్శలు చేశానే తప్ప... వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. కేసీఆర్ వల్ల తనకు రెండు సార్లు మంచి జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని... తనను జైల్లో పెట్టినప్పుడు తన కుమార్తెను తెరపైకి తెచ్చానని చెప్పారు.

హరీశ్ రావుతోనే తనకు విభేదాలున్నాయని జగ్గారెడ్డి అన్నారు. తనను జైల్లో పెట్టించింది హరీశేనని మండిపడ్డారు. హరీశ్ రావువి బ్లాక్ మెయిల్ రాజకీయాలని విమర్శించారు. కేటీఆర్ నిజాయతీ గల నాయకుడని ప్రశంసించారు.

లాబీయింగ్ చేసే వారికే కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయని... తనలాంటివాళ్లకు లాబీయింగ్ చేసేవాళ్లు లేరని జగ్గారెడ్డి అన్నారు. ఇబ్బంది పడుతున్న నేతలకు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 75 శాతం మంది నేతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.
KTR
kcr
Harish Rao
jagga reddy
congress
TRS

More Telugu News