ప్రయాణికుడి బ్యాగులో నెల వయసున్న చిరుతపిల్ల.. అధికారుల షాక్!
- అనుమానాస్పదంగా యువకుడు
- నిఘా పెట్టిన ఏఐయూ అధికారులు
- గ్రీన్ ఛానల్ దాటగానే అడ్డుకున్నారు
ప్రయాణికుడి బ్యాగులో ఒక నెల వయసున్న చిరుత పిల్ల కనిపించింది. వెంటనే ఆ యువకుడి బోర్డింగ్ పాస్, పాస్‌పోర్టును జప్తు చేసిన అధికారులు.. చిరుత పిల్లను అరిగ్నర్ అన్నా జంతు ప్రదర్శశాలకు అప్పజెప్పారు. చట్ట విరుద్ధంగా బ్యాగులో చిరుత పిల్లను తీసుకొచ్చిన యువకుడిని పోలీసులు తమిళనాడు అటవీశాఖాధికారులకు అప్పజెప్పారు.