విజయ్ సేతుపతి సాయం చేసినా.. వృద్ధురాలిని వెంటాడిన దురదృష్టం!
- మామనిథాన్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి
- మందుల కోసం డబ్బులడిగిన కవలమ్
- డబ్బు తీసుకెళుతుండగా స్పృహ కోల్పోయింది
- ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే మృతి
అక్కడ ఉన్నవారు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. కవలమ్ గతంలో మలయాళం సినిమాల్లో నటించిందని తెలుస్తోంది. అయితే కవలమ్‌కు విజయ్ సాయమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు తెగ ఖుషీ అయ్యారు కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తరువాత కవలమ్ చనిపోయిన విషయాన్ని తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు.