వచ్చేనెల 22న 'మహానాయకుడు' విడుదల?
Add ap7am to your home Screen

వచ్చేనెల 22న 'మహానాయకుడు' విడుదల?

  • ఆదరణ పొందలేకపోయిన 'కథానాయకుడు'
  • ముగింపు పనుల్లో 'మహానాయకుడు'
  • త్వరలో అధికారిక ప్రకటన
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగంగా వచ్చిన 'కథానాయకుడు' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం .. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో 'మహానాయకుడు' రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకుంది.

ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత మనసు మార్చుకుని, ఫిబ్రవరి చివరివారంలో విడుదల చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. వచ్చేనెల 22వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తాజా సమాచారం. ఈ విడుదల తేదీని దృష్టిలో పెట్టుకునే ఆ దిశగా పనులు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. 'కథానాయకుడు' సినిమాను ఈ నెల 9వ తేదీ .. బుధవారం విడుదల చేశారు. 'మహానాయకుడు' సినిమాను మాత్రం శుక్రవారం రోజునే విడుదల చేయాలనే ఉద్దేశంతో వచ్చేనెల 22ను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.
balakrishna
vidyabalan

More Telugu News