నా మీద కేసులున్న మాట వాస్తవం.. నా ఇంట్లో బాంబులు పేలిన మాట వాస్తవం: కోడెల
- నేను ఎప్పటికీ పల్నాటి పులినే
- ఫ్యాక్షనిస్ట్ అనడం బాధ కలిగించింది
- రాధా టీడీపీలోకి వస్తే శుభపరిణామమే
వైసీపీలో ఇమడలేక చాలా మంది టీడీపీలోకి వస్తున్నారని కోడెల పేర్కొన్నారు. బ్యాట్స్మెన్ అయిన తనను అంపైర్ స్థానంలో కూర్చోబెట్టినందుకు ఏనాడూ బాధపడలేని తెలిపారు. తాను ఫ్యాక్షనిస్టుని అయితే తన మీదే నాలుగుసార్లు హత్యాయత్నం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. తనను ఫ్యాక్షనిస్ట్ అనడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ పల్నాటి పులినేనని కోడెల స్పష్టం చేశారు.