జీఎస్టీ పరిధి నుంచి కేబుల్‌ ఆపరేటర్లను మినహాయించాలి: తెలంగాణ ఫెడరేషన్‌ డిమాండ్‌

23-01-2019 Wed 10:28 | Telangana
  • సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి
  • ట్రాయ్‌ నిబంధనలతో డిజిటల్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌ పెనుభారం
  • కస్టమర్లకూ ఇబ్బందులేనని ఆందోళన
జీఎస్టీ పరిధి నుంచి కేబుల్‌ ఆపరేటర్లను మినహాయించాలని తెలంగాణ డిజిటల్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌ పెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ట్రాయ్‌ సరికొత్త టారిఫ్‌ విధానంతో డిజిటల్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌ మెడపై కత్తివేలాడుతోందని, వినియోగదారులపైనా అదనపు భారం పడుతుందని  సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం బ్రాడ్‌కాస్టర్లు, ఎంఎస్‌ఓలను కాపాడడానికే న్యూ టారిఫ్‌ విధానం అమల్లోకి తెచ్చారని సమావేశం అభిప్రాయపడింది.

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్‌ అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆపరేటర్ల  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు వినోదాన్నిచ్చే కేబుల్‌ వ్యవస్థపై జీఎస్టీ ఎత్తివేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమస్యపై కేంద్రంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాయ్‌ విధించిన గరిష్ట ధర 19 రూపాయలను ఐదు రూపాయలకు తగ్గించాలన్నారు. ప్రస్తుతం 350 చానళ్లకు కస్టమర్‌ నుంచి రూ.250 వసూలు చేస్తున్నామని, నూతన విధానం అమలు చేయాలంటే  వెయ్యి రూపాయలు వసూలు చేయాలన్నారు. సెట్‌ ఆఫ్‌ బాక్స్‌లు వినియోగదారులవని, కానీ ఎంఎస్‌ఓలు తమవని బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాడ్‌ కాస్టర్లు, ఎంఎస్‌ఓలకు అనుకూలంగా ఉన్న నూతన విధానం వినియోగదారులకు పెనుభారమని, కనీసం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినా కొంత భారం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
cable operators fedarationGSTKCRtrai regulations

More Telugu News

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46
..more