కేన్ విలియమ్సన్ ఒంటరి పోరు... ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్!

23-01-2019 Wed 09:56 | Sports
  • నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డే
  • రాణించిన విలియమ్సన్
  • న్యూజిలాండ్ స్కోరు 146/6
నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లెవరూ రాణించకపోవడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కేన్ విలియమ్సన్ మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు సాధించలేదు. ఓపెనర్లు ఎంజే గుప్టిల్ 5 పరుగులకు, మున్రో 8 పరుగులకు నిష్క్రమించిన తరువాత క్రీజులోకి అడుగుపెట్టిన విలియమ్సన్, భారత బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరును ముందుకు సాగించాడు.

ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికి అండగా నిలుస్తాడనుకున్న టేలర్ 24, లాథమ్ 11 పరుగులకు, నికోల్స్ 12 పరుగులకు, శాంట్ నర్ 14 పరుగులకు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు, చాహాల్ కు 2, కేఎం జాదవ్ కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు. విలియమ్సన్ 64 పరుగులతో ఉన్నాడు. సౌదీ, ఫెర్గ్యూసన్, బౌల్ట్ లు బ్యాటింగ్ కు దిగాల్సివుంది. 
NewzelandWilliamsonIndiaCricket

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more