తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. మొదలైన కౌంటింగ్!

21-01-2019 Mon 14:44 | Telangana
  • 75 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారుల వెల్లడి
  • 3,701 పంచాయతీ, 28,976 వార్డులకు ఎన్నికలు
  • ఈ నెలలోనే మిగిలిన రెండు విడతల పోలింగ్
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిబంధనల మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకే గడువు ముగిసినప్పటికీ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. తొలి విడతలో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ పూర్తియినందున అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ను ప్రారంభించారు.

ఈసారి ఎన్నికల్లో మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.  దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో 12,202 మంది సర్పంచ్ లుగా, 70,094 మంది వార్డ్ మెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, మిగిలిన రెండు విడతల పోలింగ్ ను ఈ నెల 25, 30న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Telanganapanchayat elections75 percentpolling

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more