'మజ్ను' దర్శకుడితో నందమూరి హీరో

19-01-2019 Sat 13:45 | Entertainment
  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా '118'
  • తదుపరి సినిమా విరించి వర్మతో 
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ    
కల్యాణ్ రామ్ ను సక్సెస్ పలకరించి చాలా కాలమే అయింది. సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఆయన కొత్త చిత్రాలను చేస్తూ వెళుతున్నాడు. ఈ సారి మరింత కొత్త కంటెంట్ ను ఎంచుకుని, గుహన్ దర్శకత్వంలో '118' సినిమా చేస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో దర్శకుడికి కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడి పేరే విరించి వర్మ. ప్రేమకథలను తెరకెక్కించడంలో విరించి వర్మకి మంచి పట్టుంది. 'ఉయ్యాలా .. జంపాలా' .. 'మజ్ను' సినిమాలు ఆ విషయాన్ని నిరూపిస్తాయి. అలాంటి విరించి వర్మ .. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. 
kalyan ram

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more