రేపిస్టులకు క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

15-01-2019 Tue 11:13 | National
  • ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఘటన
  • గతేడాది రేప్ చేసి వీడియో చిత్రీకరణ
  • బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అఘాయిత్యం
ఓ వివాహితపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి పలుమార్లు తమ మృగవాంఛను తీర్చుకున్నారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన సదరు మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కేర్నాల్ గంజ్ ప్రాంతానికి చెందిన శంకర్ దయాల్, అశోక్ ఇదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై గతేడాది, ఆగస్టులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి పలుమార్లు బెదిరించి లైంగికదాడికి దిగారు. చివరికి వీరి వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో యూపీ అసెంబ్లీ ముందు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది.

దీంతో ఈ కేసును యూపీ పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు విచారణ చేబట్టారు. అయితే, గతేడాది డిసెంబర్ లో నిందితులకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై మృతురాలి భర్త మాట్లాడుతూ.. పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించాడు.

అందుకే తన భార్య ఆత్మహత్య చేసుకుందని విలపించాడు. మరోవైపు ఈ విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ కేసును డీల్ చేసిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
Uttar Pradeshrapevictimsuicide

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more