పెళ్లి గురించి స్పందించిన కీర్తి సురేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి గురించి స్పందించిన కీర్తి సురేశ్

  • హీరోయిన్ ను అవుతానని అనుకోలేదు
  • అవకాశాలతో పాటు అదృష్టం తోడైంది
  • పెళ్లి గురించిన ఆలోచన లేదు    
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఒక వైపున హీరోల జోడీ కడుతూ గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలకి ఓకే చెబుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించిన ప్రస్తావన వచ్చింది. అందుకు కీర్తి సురేశ్ స్పందిస్తూ .. "అసలు నేను హీరోయిన్ ను అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. సరదాగా ఒకటి రెండు సినిమాలు చేసేసి వెళ్లిపోదామని వచ్చాను.

తెలుగు .. తమిళ భాషల్లో మంచి మంచి అవకాశాలు రావడంతో .. అదృష్టం తోడు కావడంతో సక్సెస్ లు వచ్చాయి. నాకు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి నేను ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నాను. అలాగే మరిన్ని విభిన్నమైన పాత్రలను పోషించి, నటిగా పూర్తి మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతా కెరియర్ పైనే వుంది. అందువలన పెళ్లి గురించిన ఆలోచన లేదు. ఒక నటిగా నేను అనుకున్న పాత్రలను చేసి ముచ్చట తీర్చుకున్నాకే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చింది. 
keerti suresh

More Telugu News