'ఎఫ్ 2' సినిమా చూసిన మహేశ్ బాబు.. వెంకీ, వరుణ్ తేజ్ లపై ప్రశంసల వర్షం!
- ఎఫ్ 2ను బాగా ఎంజాయ్ చేశానన్న మహేశ్
- వెంకీ అద్భుతంగా నటించారని కితాబు
- వరుణ్ తేజ్ టైమింగ్ కు సరిపోయాడని వ్యాఖ్య
‘ఎఫ్ 2 సినిమా చూశా. పూర్తి వినోదాత్మక చిత్రం. చాలా ఎంజాయ్ చేశా.. వెంకీ సర్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు, అది చాలా ఫన్నీగా అనిపించింది.. బ్రిలియంట్. వరుణ్‌తేజ్ పాత్ర కూడా చాలా సరదాగా ఉంది. వెంకీ సర్ టైమింగ్‌కు వరుణ్ సరిగ్గా సరిపోయాడు’ అని మహేశ్ ట్వీట్ చేశాడు.
మహేశ్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, జయసుధ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.