నాదెండ్ల యూట్యూబ్ వీడియో హిట్లు.. ‘ఎన్టీఆర్’ సినిమా టికెట్ల అమ్మకాలను మించిపోయాయి!: రాంగోపాల్ వర్మ సెటైర్లు
- నాదెండ్ల ఎక్కువ ఫేమస్ అయిపోయారని వ్యాఖ్య
- దేవుడు, ప్రజలు భవిష్యత్ ను అంచనా వేయలేరు
- ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
ఈరోజు వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఓవైపు ఎన్టీఆర్ సినిమాలను ఫేమస్ చేసే ప్రయత్నంలో మేమంతా ఉంటే, నాదెండ్ల భాస్కరరావు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న హిట్లు, కథానాయకుడు సినిమా కలెక్షన్లను మించిపోతున్నాయి. దేవుడు, ప్రజలు.. ఎవరూ జరగబోయేదాన్ని అంచనా వేయలేరు అనడానికి ఇదే సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.