బీటెక్‌ను మధ్యలోనే మానేసి లండన్ వెళ్లి.. చివరికి దొంగగా మారిన ప్రణీత్ చౌదరి
- లండన్‌లో దౌత్యపరమైన నేరం
- ఢిల్లీకి తిప్పి పంపిన లండన్ పోలీసులు
- డబ్బుల కోసం ఢిల్లీలో నేరాలు మొదలు
రెండేళ్లు జైలులో ఉన్న ప్రణీత్‌కు మోనూ, చోకాలతో పరిచయం అయింది. ముగ్గురూ కలిసి ఓ గ్యాంగ్‌లా ఏర్పడి ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లలో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒక్కొక్కరిపైనా 50కిపైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసులు ప్రవీణ్‌పై గ్యాంగ్‌స్టర్ చట్టాన్ని ప్రయోగించడంతో అందరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. గత నెల 23న హైదరాబాద్ కు వచ్చిన వీరు కాచిగూడలోని హోటల్లో దిగారు. 25న ‘ఓఎల్ఎక్స్’ ద్వారా ఓ బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. 26న దానిపై తిరుగుతూ గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.