తాతయ్యకు సంబంధించి ఓ ఇంటర్వ్యూ చూశానంతే: హీరో సుమంత్
- ‘యన్.టి.ఆర్’లో తన పాత్ర గురించి చెప్పిన సుమంత్
- దర్శకుడు క్రిష్ అద్భుతంగా మలిచారు
- క్రిష్ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించాను
అసలు, ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ అందరికీ బాగా నచ్చిందని, అదే తనకు కొండంత ధైర్యం ఇచ్చిందని సుమంత్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తమ తాతయ్య పాత్రను అద్భుతంగా మలిచారని, క్రిష్ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. క్రిష్, బాలకృష్ణ..ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ చిత్రంలో తాను నటించే సాహనం చేసేవాడిని కాదని అన్నారు.