ఐశ్వర్యతో విడాకులు పక్కా.. ఈ జీవితానికి ఇంతే!: తేజ్ ప్రతాప్
- నేను మోదీలా ఉండాలనుకోవడం లేదు
- నా తండ్రే నాకు ఆదర్శం
- నా దృష్టంతా రాజకీయాలపైనే
ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా రాజకీయాలవైపే కేంద్రీకరించినట్టు చెప్పారు. ఐశ్వర్యరాయ్‌తో విడాకులు ఖాయమని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకోబోనని పేర్కొన్నారు. తన తండ్రే తనకు ఆదర్శమని, మోదీలానో, ఇంకెవరిలానే తాను ఉండాలనుకోవడం లేదన్నారు. తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌లా పేదల సేవలోనే ఉంటానన్నారు.
తల్లి రబ్రీదేవి తనను బాగా చూసుకుంటున్నారని, తన నిర్ణయాలకు ఆమె మద్దతు ఉందని తెలిపారు. రాష్ట్రంలోని నితీశ్ ప్రభుత్వాన్ని పారదోలి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.