విద్యార్థుల తల్లిదండ్రుల్లో, ప్రజల్లో నమ్మకం కలిగేలా విద్యాబోధన అందించే బాధ్యత అధ్యాపకులదేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. నేడు సిద్దిపేటలో కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్ది.. రేపటి తరానికి ఈ విద్యాలయం ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు వచ్చినట్టే వచ్చి పోయిందని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అది సాధ్యమైందన్నారు. ఎనిమిదేళ్ల పాటు పడ్డ శ్రమ నేటికి ఫలితాన్నిచ్చిందన్నారు. కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు రావడంతో తన కల నెరవేరిందని.. ఈ రోజు తనకెంతో ఆనందంగా ఉందని హరీశ్ రావు తెలిపారు.