ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింల విడాకులు 4 లక్షలకు చేరుకుంటాయ్!: టీజీ వెంకటేశ్ హెచ్చరిక
- కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వెళుతోంది
- దేశంలో ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కేసులు తక్కువే
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
గతేడాది దేశవ్యాప్తంగా 400-500కు మించి ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాలేదని టీజీ వెంకటేశ్ తెలిపారు. ఈ చట్టం దెబ్బకు భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ జరిగినా మహిళలు కేసులు పెడతారనీ, తద్వారా కాపురాలు విచ్ఛిన్నం అవుతాయని వ్యాఖ్యానించారు. దీని కారణంగా ఈ 400 విడాకులు 40 వేలు, నాలుగు లక్షలకు చేరుకుంటాయని హెచ్చరించారు. కాబట్టి ఈ బిల్లుపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.