ఏపీలో దారుణం.. పదో తరగతి అమ్మాయిపై బ్లేడుతో దాడిచేసిన దుండగులు!

29-12-2018 Sat 11:50 | Andhra
  • తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరులో ఘటన
  • బాధితురాలి చేతికి తీవ్రగాయం
  • కేసు నమోదుచేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ పదో తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడిచేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.

జిల్లాలోని చెయ్యేరులో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె కోసం అప్పటికే మాటువేసిన ఇద్దరు దుండగులు బైక్ పై వెంబడించారు. అనంతరం దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా బ్లేడుతో దాడిచేశారు. దీంతో బాలిక చేతికి తీవ్ర గాయం అయింది.

ఈ సందర్భంగా బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారిద్దరూ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ దాడి చోటుచేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Andhra PradeshEast Godavari Districtssc girlattackedPolice

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more