బాలీవుడ్ నటుడు కాదర్ ఖాన్ ఆరోగ్యం మరింత విషమం... స్పెషల్ వెంటిలేటర్ పై చికిత్స!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ నటుడు కాదర్ ఖాన్ ఆరోగ్యం మరింత విషమం... స్పెషల్ వెంటిలేటర్ పై చికిత్స!

  • కెనడాలో ఉంటున్న కాదర్ ఖాన్
  • కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స
  • మాట్లాడలేకపోతున్న సీనియర్ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రస్తుతం కెనడాలో ఉంటున్న కాదర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ఆయన శ్వాస తీసుకోలేకపోతుండటంతో సాధారణ వెంటిలేటర్ పై నుంచి స్పెషల్ వెంటిలేటర్ పైకి మార్చి చికిత్సను అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

తన కుమారుడు సర్ఫరాజ్, కోడలు షాహిస్తలతో కలసి కెనడాలో ఉంటున్న ఆయన ఆరోగ్యం వృద్ధాప్యం కారణంగా క్రమంగా విషమిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆయన మాట్లాడే స్థితిలో లేరని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  తన తండ్రికి మోకాలు సర్జరీ జరిగిందని, ఆ తరువాత వైద్యులు నడవాలని సలహా ఇచ్చినా అనారోగ్యం కారణంగా నడవలేకపోయారని, సర్జరీ వికటించిందని భావించడం లేదని సర్ఫరాజ్ వ్యాఖ్యానించారు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన కాదర్ ఖాన్ 'ముఝ్సే షాదీ కరోగీ', 'లక్కీ', 'ఫన్ తూష్', 'జీనా సిర్ఫ్ మేరే లియే', 'ఆంఖియోంసే గోలీ మారే', 'జోరూ కా గులామ్', 'బనారసీ బాబు', 'జుడాయి', 'జుడ్వా' వంటి సుమారు 300 చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
Canada
Khader Khan
Ventilator
Health

More Telugu News