జీవనపోరాటం.. కర్చీఫ్ లు అమ్ముకుంటున్న తమిళ సీనియర్ నటి!
- నా సంపాదనంతా పిల్లల చదువుల కోసమే వెచ్చించా
- వాళ్లు నన్ను పట్టించుకోవట్లేదు
- మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు అమ్ముకుంటున్నా
- 500 కు పైగా చిత్రాల్లో నటించిన రంగమ్మాళ్ ఆవేదన
ఈ విషయమై మీడియా ఆమెను అడగగా, ఎంజీఆర్ కాలం నుంచే తాను సినిమాల్లో నటిస్తున్నానని, ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించి ఉంటానని చెప్పింది. సంపాదించిన డబ్బంతా తమ పిల్లల కోసం ఖర్చు చేశానని, ఇప్పుడు, వాళ్లు తనను పట్టించుకోవట్లేదని, అందుకే, ఇలా, కర్చీఫ్ లు, ఇతర వస్తువులు అమ్ముకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వీటిని విక్రయించగా వచ్చే ఆదాయం అంతంత మాత్రమేనని, తమిళనాడు ప్రభుత్వం లేదా నడిగర్ సంఘం తనను ఆదుకోవాలని రంగమ్మాళ్ విజ్ఞప్తి చేసింది. కాగా, గత ఏడాదిలో నడిగర్ సంఘం ద్వారా ఆమెకు ఐదు వేల రూపాయల సాయం అందింది. ఫెఫ్సీ అనుసంధాన జూనియర్ ఆర్టిస్టు సంఘంలో రంగమ్మాళ్ సభ్యురాలు.