నాన్నగారి పాత్రలను చేయాలనే నా ముచ్చట తీరింది: బాలకృష్ణ
Add ap7am to your home Screen

నాన్నగారి పాత్రలను చేయాలనే నా ముచ్చట తీరింది: బాలకృష్ణ

  • ఎన్టీఆర్ బయోపిక్ చేయడం నా అదృష్టం 
  • సొంత బ్యానర్లో తీసినందుకు సంతృప్తిగా వుంది 
  • నాన్నగారి పాత్రలను ఇంకా ఇంకా చేయాలనిపించింది
'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందింది. ఈ రెండు భాగాలకు సంబంధించిన ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .."నాన్నగారి బయోపిక్ ను చేయడం నాకు ఒక అవకాశమే కాదు .. అదృష్టం కూడా. నాన్నగారు ఎన్నో విభిన్నమైన పాత్రలను చేశారు. ఆయన చేసిన పాత్రలను ఎప్పటికైనా సరే నేను చేయగలనో .. లేదో అని అనుకునేవాడిని.

అలాంటి నాకు ఈ బయోపిక్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా నా కోరికలన్నీ నెరవేర్చుకున్నాను. నాన్నగారు చేసిన సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన పాత్రలను ఈ సినిమాలో చేశాను. ఎన్ని చేసినా ఇంకా ఇంకా చేద్దామనే అనిపించింది. ఇక సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది నాన్నగారి సినిమాతో కుదిరినందుకు ఎంతో సంతృప్తిగా వుంది" అని ఆయన అన్నారు. 
balakrishna

More Telugu News