సజ్జన్ కుమార్ కు నిరాశ.. లొంగిపోయే గడువు పొడిగింపు కుదరదన్న న్యాయస్థానం
- సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్
- లొంగిపోయేందుకు నెలరోజుల గడువు కోరిన సజ్జన్
- గడువు పొడిగింపునకు కారణాలు కన్పించట్లేదు: హైకోర్టు
గడువు పొడిగించేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 31 లోపు పోలీసుల ఎదుట సజ్జన్ లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి, తమ కుటుంబ, ఆస్తి వ్యవహారాలు పరిష్కరించాల్సి ఉన్నందున తాను లొంగిపోవడానికి మరో నెలరోజుల గడువు కావాలని సజ్జన్ కుమార్ తన పిటిషన్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.