ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్

  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • వేదికగా జేఆర్సీ కన్వెన్షన్ 
  • రేపు సాయంత్రం 5 గంటల నుంచి మొదలు  
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' ఇప్పటికే షూటింగును పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక 'మహానాయకుడు' షూటింగు దశలో వుంది .. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు భాగాలకు సంబంధించిన ఆడియోను రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ ఇందుకు వేదికగా మారుతోంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. కీరవాణి అందించిన ఆడియోతో పాటు, ట్రైలర్ ను కూడా ఇదే వేదికపై లాంచ్ చేయనున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తుండగా, విద్యాబాలన్ .. నిత్యామీనన్ .. రకుల్ ... హన్సిక .. రానా .. సుమంత్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 
balakrishna
vidyabalan
rakul
nithya

More Telugu News