హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం.. రుణమాఫీని ప్రకటించిన రాజస్థాన్ సీఎం
- అధికారంలోకి వస్తే పది రోజుల్లోనే రుణమాఫీ అన్న రాహుల్
- రుణ మాఫీ ప్రకటించి హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో రూ. 2 లక్షల మేర రుణమాఫీ
ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోపే రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించి హామీని నిలబెట్టుకున్నాయి.