'వినయ విధేయ రామ' నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది
Add ap7am to your home Screen

'వినయ విధేయ రామ' నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది

  • బోయపాటి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు 
బోయపాటి సినిమాలు యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. ఈసారి ఆయన ఎమోషన్ డోస్ ను కాస్త పెంచి 'వినయ విధేయ రామ' సినిమా చేశాడు. చరణ్ కథానాయకుడిగా .. కైరా అద్వాని ఆయన జోడీగా ఈ సినిమాను రూపొందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన ఫస్టుసాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో రెండవ సాంగ్ ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. నాయకా నాయికల మధ్య సాగే 'తస్సాదియ్యా ..' అనే పాటను ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు వదలనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనని మెగా అభిమానులు భావిస్తున్నారు. 
charan
kiara advani

More Telugu News