కేసీఆర్ అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత!
- ముహూర్తం మేరకు 1.25 గంటలకు ప్రమాణం
- మంత్రిగా మొహమూద్ అలీ బాధ్యతలు
- జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన వేదిక
ప్రమాణస్వీకారం పూర్తవగానే కేసీఆర్ వేదికపైనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం పెట్టారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం మొహమూద్ అలీ తెలంగాణ మంత్రిగా అల్లాహ్ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని ప్రమాణం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు, నేతలు భారీగా తరలివచ్చారు.