మా వాళ్లను ప్రలోభపెట్టాలని చూస్తారా.. మీ కుట్రలు సాగవు.. జాగ్రత్త!: బాల్క సుమన్ హెచ్చరిక
- ఈ ఓట్ల సునామీలో కాంగ్రెస్, చంద్రబాబు కొట్టుకుపోతారు
- గెలవబోయే మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తే సహించం
- చంద్రబాబునాయుడిని, టీ-కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్నాం
మంద కృష్ణ, గద్దర్ లాంటి వాళ్లను కూడా ఆ కలుషితమైన కూటమిలో కట్టిపెట్టారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసి తమ ఆటలు సాగవన్ననిర్ధారణకు వచ్చి, చివరి ప్రయత్నంగా.. గెలవబోయే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబునాయుడిని, టీ-కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్నామని అన్నారు. తెరవెనుక ఉండి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్లందరినీ కూడా హెచ్చరిస్తున్నానని, వాళ్లు కుట్రలు సాగవని అన్నారు.