ఫొటోగ్రాఫర్ కి 72 లక్షల జీతంతో ఉద్యోగం.. యూకే కుటుంబం ఆఫర్!
- ఓ ధనిక కుటుంబం బంఫర్ ఆఫర్
- విహారయాత్రల్లో ఫొటోలు తీస్తే చాలు
- వచ్చే ఏడాది నుంచే ప్రక్రియ ప్రారంభం
యూకేకు చెందిన ఓ ధనిక కుటుంబం వివిధ ప్రాంతాలకు షికార్లకు వెళ్తుంటారు. విహారయాత్రల్లో తిరిగే సమయాల్లో వారి ఫొటోలు తీసేందుకు ఓ ఫొటో గ్రాఫర్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఓ ప్రకటనను perfocal.com అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఫొటోలు అందంగా తీయగలిగే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వారు చేయాల్సిన పని కూడా తెలియపరిచారు. కుటుంబ సభ్యులు ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడికి వెళ్లి ఫొటోలు తీయాలని వెల్లడించారు.
ఇక ఉద్యోగ సమయం కూడా చాలా తక్కువ.. రోజుకి కేవలం 4 గంటలు పని చేస్తే చాలు. అంతేకాదు, ఏడాదికి 30 రోజులు సెలవు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే ఆ రోజు ఇవ్వాల్సిన జీతం కూడా ఇచ్చేస్తారు. ఈ ఉద్యోగమేదో భలే ఉంది కదూ, ఈ ఉద్యోగపు ఎంపిక ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.