నాగశౌర్య జోడీగా నిధి అగర్వాల్
- కలసిరాని 'సవ్యసాచి'
- రెండో సినిమాగా 'మిస్టర్ మజ్ను'
- త్వరలో సెట్స్ పైకి మూడో సినిమా
ఈ సినిమా హిట్ అయితే ఈ సుందరి జోరు ఒక రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయికి మరో ఛాన్స్ వచ్చింది .. అదీ నాగశౌర్య జోడీగా. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కాశీ అనే నూతన దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం నిధి అగర్వాల్ ను తీసుకున్నారట. సుకుమార్ సొంత బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది.