గతంలో ముందస్తుకు వెళ్లి ఓడిన కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు... చరిత్రను కేసీఆర్ తిరగరాసేనా?

08-12-2018 Sat 09:58 | Both States
  • ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ముందస్తు
  • మూడుసార్లు ఓడిపోయిన అధికార పార్టీ
  • కేసీఆర్ చరిత్రను మారుస్తారంటున్న టీఆర్ఎస్ వర్గాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబులు ముందస్తుకు వెళ్లి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో 9 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ చరిత్రను తిరగరాస్తారా? లేదా వారి మాదిరే ఓటమి పాలవుతారా? అన్న ఆసక్తికర చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.

వాస్తవానికి ముందస్తు ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. వాటిల్లో ఒకటి అనివార్య పరిస్థితుల్లో జరుగుతుంది. అంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడి, ప్రభుత్వం రద్దు కావడం వంటి కారణాలన్నమాట. ఇక విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి, అధికార పార్టీలు ముందుగానే ఎన్నికలకు వెళుతుంటాయి.

ఏపీ ఏర్పడినప్పటి నుంచి మూడు దఫాలు ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన తరువాత, ఆయన ప్రభావంపై భయపడిన నాటి సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి 1983 ఆగస్టులో జరపాల్సిన ఎన్నికలను జనవరిలోనే పెట్టించారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్నే చూపించారు. 202 స్థానాలను గెలుచుకుని తొలిసారిగా సీఎం పీఠాన్నెక్కారు. 1984లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేయించిన ఎన్టీఆర్, 1985లో జరిపిన ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆపై 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సివుండగా, ఎన్టీఆర్ 4 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఆ తరువాత 2003లో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్ల దాడి జరిగిన తరువాత చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ప్రజల సానుభూతి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నా, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.

ఇలా ఏపీలో జరిగిన ఈ మూడు ముందస్తు ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఓడిపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు జరిగిన ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ చరిత్రను తిరగరాయడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.
KCRTelugudesamCongressElections

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more