ఎన్టీఆర్ కోసమే ఆ సినిమా చేశాను: హీరోయిన్ ఈషా రెబ్బా
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ కోసమే ఆ సినిమా చేశాను: హీరోయిన్ ఈషా రెబ్బా

  • ఎన్టీఆర్ సినిమాలో కనిపించడమే అదృష్టం 
  • పాత్ర చిన్నదైనా పట్టించుకోలేదు 
  • వచ్చే ఏడాది నా కెరియర్ మరింత బాగుంటుంది  
తెలుగు తెరపై వరుస అవకాశాలను అందుకుంటూ ఈషా రెబ్బా తన దూకుడు పెంచుతోంది. ఆమె తాజా చిత్రమైన 'సుబ్రహ్మణ్యపురం' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా మాట్లాడుతూ .. తనకి ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయనీ .. గుర్తింపు కలిగిన పాత్రలు దక్కుతున్నాయని చెప్పింది. ఈ ఏడాది తాను చేసిన సినిమాలు తనకి సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగించాయని అంది.

'అరవింద సమేత'లో అంతగా ప్రాముఖ్యతలేని పాత్రను చేశానంటూ వచ్చిన విమర్శలను గురించి ప్రస్తావించింది. ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో అవకాశం రావడమే అదృష్టమనీ .. అందువలన పాత్ర చిన్నదైనా పట్టించుకోలేదని చెప్పింది. ఎన్టీఆర్ సినిమాలో కనిపిస్తే చాలనుకున్నాననీ, ఆ పాత్రను చేసినందుకు తానేమి బాధపడటం లేదని అంది. వచ్చే ఏడాది తన కెరియర్ గ్రాఫ్ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.    
eesha rebba

More Telugu News