జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఉన్నాడిప్పుడు.... ఓటేసేందుకు వస్తే క్లిక్ మనిపించిన కెమెరాలు!
Add ap7am to your home Screen

జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఉన్నాడిప్పుడు.... ఓటేసేందుకు వస్తే క్లిక్ మనిపించిన కెమెరాలు!

  • వంద కిలోల బరువు పెరిగారని వార్తలు
  • ఈ ఉదయం ఓటేసేందుకు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
  • ఫోటోలు తీసేందుకు పోటీ
రాజమౌళి సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ వంద కిలోల బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం గెటప్ నే మార్చేశాడు... గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలివి. కానీ ఇవన్నీ తప్పని తేలిపోయింది. ఎన్టీఆర్ మామూలుగానే ఉన్నాడు. ఈ ఉదయం తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలసి జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు వచ్చిన ఆయన ఓటేసేందుకు సుమారు 40 నిమిషాల పాటు క్యూలైన్లో వేచి చూసి, ఆపై ఓటేశాడు.  చాలా రోజుల తరువాత జూనియర్ ఎన్టీఆర్ బయట కనిపించడంతో మీడియా కెమెరాలు ఆయన ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డాయి.
NTR
Vote
Rajamouli

More Telugu News