మిస్టరీ థ్రిల్లర్ కి రానా వాయిస్ ఓవర్
Add ap7am to your home Screen

మిస్టరీ థ్రిల్లర్ కి రానా వాయిస్ ఓవర్

  • సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం'
  • ఆలయం నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 7వ తేదీన విడుదల  
సుమంత్ కథానాయకుడిగా మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో 'సుబ్రహ్మణ్య పురం' సినిమా రూపొందింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుబ్రహ్మణ్యపురంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ వున్న మిస్టరీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ మిస్టరీని ఛేదించే నాస్తికుడి పాత్రలో సుమంత్ కనిపించనున్నాడు.

ఈ సినిమాలో అక్కడక్కడా వాయిస్ ఓవర్ ఉందట. సన్నివేశాలను కలుపుతూ సాగే వాయిస్ ఓవర్ ను ఎవరితో చెప్పించాలా అనే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. అప్పుడు రానాతో చెప్పిస్తే బాగుంటుందని సుమంత్ సూచించడంతో, ఆయన ద్వారానే రానాను సంప్రదించడం జరిగిందట. సుమంత్ కోసం రానా చెప్పిన వాయిస్ ఓవర్ కథలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని అంటున్నారు. 'బాహుబలి'కి పనిచేసిన గ్రాఫిక్స్ టీమ్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ను అందించడం విశేషం.  
sumanth

More Telugu News