బాలకృష్ణతో వినాయక్ మూవీ ఉన్నట్టే!
Add ap7am to your home Screen

బాలకృష్ణతో వినాయక్ మూవీ ఉన్నట్టే!

  • 'ఇంటిలిజెంట్' మూవీ తరువాత గ్యాప్ 
  • బాలకృష్ణ కోసం కథపై కసరత్తు 
  • నిర్మాతగా సి.కల్యాణ్ ప్రయత్నాలు
మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా వీవీ వినాయక్ కనిపిస్తాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. 'ఇంటిలిజెంట్' తరువాత మంచి ప్రాజెక్టును సెట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన గ్యాప్ తీసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి నిర్మాత సి. కల్యాణ్ ప్రయత్నించాడు.

అయితే ఈలోగా బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అయ్యారు. దాంతో బాలకృష్ణతో వినాయక్ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే సందేహం ఏర్పడింది. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన తరువాత బాలకృష్ణతో వినాయక్ మూవీ వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్. అందుకు సంబంధించిన సన్నాహాలను సి.కల్యాణ్ చక్కబెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కథపై వినాయక్ కసరత్తు కొనసాగుతోందని అంటున్నారు. ఈ సినిమా తరువాత వినాయక్ రాజకీయాల వైపు వెళ్లనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది.  
balakrishna
vinayak

More Telugu News