నాని సినిమా చేయడానికి ఆసక్తిని చూపని కీర్తి సురేశ్ .. కారణం అదేనంటూ టాక్!
- 'జెర్సీ'తో బిజీగా నాని
- రెండు ప్రాజెక్టులు లైన్లో
- రాజమౌళి మూవీలో కీర్తి సురేశ్?
ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటి .. చంద్రశేఖర్ యేలేటితో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. చంద్రశేఖర్ యేలేటి తన సినిమా కోసం ఇటీవల కీర్తి సురేశ్ ను అడిగాడట. దాంతో కొంతకాలం పాటు తాను డేట్స్ ఇవ్వలేనని కీర్తి సురేశ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి మల్టీ స్టారర్ మూవీలో ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనీ, ఈ కారణంగానే ఆమె వేరే సినిమాలకి డేట్స్ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.