సంచలనమే .. 250 కోట్ల వసూళ్ల దిశగా 'సర్కార్'
- తొలి వారంలో 100 కోట్ల గ్రాస్
- రెండవ వారంలో 200 కోట్లకి పైగా
- విజయాన్ని ఆపలేకపోయిన వివాదాలు
మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, 250 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా 247 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా విడుదలకి ముందు .. తరువాత కూడా కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. అయినా వసూళ్లను అవి ఎంత మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. దీపావళి తరువాత వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. మొత్తానికి విజయ్ ఈ ఏడాది చివరిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.