ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
- ఆకాశ్ హీరోగా మరో సినిమా
- దర్శకుడిగా అనిల్ పరిచయం
- గోవా నేపథ్యంలో చిత్రీకరణ
ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితం కానుంది. అందువలన ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అనిల్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందనీ .. లొకేషన్ల ఎంపిక కూడా జరిగిపోయిందని అంటున్నారు. గోవా బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ చిత్రీకరణ జరపనున్నారని చెబుతున్నారు. కథానాయిక ఎవరనే విషయంతోపాటు, మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.