నరేంద్ర మోదీ హత్యకు పన్నాగం కేసులో వరవరరావు అరెస్ట్... పుణెకు తరలింపు!
- మోదీ హత్యకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు
- అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు
- నేడు పుణె కోర్టుకు వరవరరావు
కాగా, ఇదే కేసులో గతంలో వరవరరావు అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు ఆధారాలు సమర్పించడంతో, వారిని అరెస్ట్ చేయవచ్చని అత్యున్నత ధర్మాసనం ఇటీవల పేర్కొంది. దీంతో ఈ కేసులో ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తున్న పోలీసులు, ఇప్పటికే అరుణ్ పెరీరా, వెర్నల్ గాన్స్ , సుధా భరధ్వాజ్, గౌతమ్ నవాల్కర్ లను అరెస్ట్ చేశారు.