కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు

  • అమరావతిలో నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు
  • కొందరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదని వ్యాఖ్య
  • హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చింది తానేనని వెల్లడి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను నేడు చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చిందే తానని.. ఈ విషయం మాట్లాడితే కేసీఆర్ తనను ఏదో ఒకటి అంటారని అన్నారు. కొందరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదని.. బంగారు బాతులాంటి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.

Go Back to Shorts
Chandrababu
KCr
Administration
Hyderabad
Amaravathi

More Telugu News