టూరిస్టులను వెంటాడిన పులి.. భయంతో కేకలు.. వీడియో వైరల్
- టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఘటన
- భయంతో బిక్కచచ్చిపోయిన పర్యాటకులు
- డ్రైవర్ వేగం పెంచడంతో తప్పిన ప్రమాదం
పులి వెంబడించిన ఘటనపై రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగినట్టు చెప్పారు. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్లున్న ‘చోటీ మధు’ అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని పేర్కొన్నారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు ఆయన తెలిపారు.