జగన్ కోలుకోవాలంటూ.. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే!
- పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
- మొక్కు చెల్లించుకున్న వైసీపీ నేత బాలరాజు
- వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా
వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పశ్చిమగోదావరిలోని గుబ్బల మంగమ్మతల్లి ఆలయానికి వెళ్లారు. మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కి పైకివెళ్లిన బాలరాజు మంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్ కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజలు జగన్ కు తోడుగా ఉన్నారని తెలిపారు.