'ఇలాగైతే మాట్లాడటం కష్టం' అంటూ ప్రసంగాన్ని ఆపేసిన పవన్ కల్యాణ్!
- తూర్పు గోదావరి జిల్లా పెద్దిపాలెంలో పవన్ సభ
- సరైన ఏర్పాట్లు చేయని స్థానిక నేతలు
- పని చేయని మైకులు, పవన్ అసహనం
దీంతో పవన్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక దశలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన పవన్, ఇటువంటి మైకులు ఉన్న చోట మాట్లాడటం కష్టం అంటూ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, ఏలేరు కాలువ వెంబడి భూములను కలిగివున్న రైతులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మెట్టప్రాంతాల రైతుల కోసం కాలువ వెంబడి చెక్ డ్యాములను నిర్మిస్తామని తెలిపారు.